Share News

యువత డ్రగ్స్‌ బారిన పడకుండా చూడండి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM

రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం తీవ్రమైన సమస్యగా మారుతోందని... యువత భవిష్యత్తును దెబ్బదీసే డ్రగ్స్‌ నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

యువత డ్రగ్స్‌ బారిన పడకుండా చూడండి
ర్యాలీలో పాల్గొన్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు:

అరసవల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం తీవ్రమైన సమస్యగా మారుతోందని... యువత భవిష్యత్తును దెబ్బదీసే డ్రగ్స్‌ నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలోని సూర్యమహల్‌ కూడలి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ కేసులో సాక్షాత్తు టీడీపీ పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్‌ పట్టుబడడం దారుణమని.. వెంటనే ఆయనను పార్టీ సస్పెండ్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌, నాయకులు అరవింద్‌, రామోజీ, వసంతరావు, శ్రీనిధి, అన్నాజీ, హేమంత్‌, కృష్ణ, వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:12 AM