Share News

అంటురోగాలు ప్రబలకుండా చూసుకోండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:29 AM

అంటురోగాలు ప్రబలకుండా అప్ర మత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ సూచించారు.

అంటురోగాలు ప్రబలకుండా చూసుకోండి
అధికారులతో సమీక్షిస్తున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ

  • జడ్పీ సీఈవో సత్యనారాయణ

పాతపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అంటురోగాలు ప్రబలకుండా అప్ర మత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ సూచించారు. మేజర్‌ పంచాయతీ పాతపట్నంలోని శివశంకర్‌ కాలనీ చర్చివీధిలో గల వాటర్‌ ట్యాంక్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం డయేరియా ప్రబలే అవకాశం ఉన్నందున్న తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లోరినేషన్‌, నీటి నాణ్యత పరిశీలించి ప్రజలకు సరఫరా చేయాలన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గల నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ చాంబర్‌లో పీ-4పై సమీక్షించారు. కార్య క్రమంలో వ్యవసాయ, ఎన్నికల డీటీ సీవీఏపీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:29 AM