ప్రయాణికుల్లా నటిస్తూ...
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:30 AM
రైళ్లలో ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ.. తోటి ప్రయాణికుల సెల్‌ఫోన్లను దొంగిలించే ముఠాలోని సభ్యులు ఇద్దరిని శుక్రవారం రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
రైళ్లలో సెల్‌ఫోన్లు దొంగిలించే ముఠా సభ్యుల అరెస్టు
10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు
పలాస, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రైళ్లలో ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ.. తోటి ప్రయాణికుల సెల్‌ఫోన్లను దొంగిలించే ముఠాలోని సభ్యులు ఇద్దరిని శుక్రవారం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులను విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరుపరిచారు. రైల్వే ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు కథనం మేరకు... ఒడిశా రాష్ట్రం కళ్లికోటకు చెందిన జగన్ బెహరా, బుండ బనజాలిలు రైళ్లలోని ప్రయాణికుల సెల్‌ఫోన్లు అపహరిస్తుంటారు. ఈ మేరకు ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిఘా పెట్టి చోరీకి పాల్పడుతున్న నిందితులను గుర్తించారు. వారిని విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.