Share News

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 నిలిపివేయాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:53 PM

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 పేరుతో సెటిల్డ్‌ అయిన ఉద్యోగుల సర్వీసులను అన్‌సెటిల్‌ చేసే ప్రక్రి యను ప్రభుత్వం నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యో గుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ చేశా రు.

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 నిలిపివేయాలి
మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

ఏపీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

శ్రీకాకుళం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 పేరుతో సెటిల్డ్‌ అయిన ఉద్యోగుల సర్వీసులను అన్‌సెటిల్‌ చేసే ప్రక్రి యను ప్రభుత్వం నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యో గుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ డిమాండ్‌ చేశా రు. బుధవారం జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో సంఘ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ జిల్లాల పునర్వవ్యవ స్థీకరణను కారణంగా చూపి 95 శాతం స్థానిక రిజర్వేషన్‌తో కొత్త జోనల్‌ వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమ స్యలపై అక్టోబరు 12 నుంచి చర్చలు, ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌, రాష్ట్ర కార్య దర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి పైడి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.నరసింహమూర్తి, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:53 PM