సాగునీటి కాలువలు సిద్ధం చేయండి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:52 PM
ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటి కాలువలను సిద్ధంచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వంశధార అధికారులతో సమీక్షించారు.
నరసన్నపేట, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటి కాలువలను సిద్ధంచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వంశధార అధికారులతో సమీక్షించారు. వంశధార ప్రాజెక్ట్ పరిధిలోని చివరి భూములకు నిరంతరాయంగా, సమృద్దిగా సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించడంపై అధికారులతో చర్చించారు. కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు, ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానున్న నేపధ్యంలో పూడికతీత, లైనింగ్‌పనులు, లాకుల మరమ్మతులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో నీటి వృథాను అరికట్టడంలో, రైతుల మధ్య నీటి పంపిణీ క్రమబద్దీకరించడంలో నీటిసంఘాల అధ్యక్షులు, కమిటీ చైర్మన్లు పాత్రను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, వంశధార డీసీ చైర్మన్లు శిమ్మ చంద్ర శేఖర్, కింజరాపు సత్యం, కె.నాగరాజు, ఎంవీ అప్పలనాయుడు, చిరంజీవి వంశధార ఈఈ మురళీమోహనరావు, ఏఈలు పాల్గొన్నారు.