వరుణుడు కరుణించాలని..
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:51 PM
: రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో వరు ణుడు కరు ణించాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మం గళవారం ఇచ్ఛాపురం, ఆమదాల వలసల్లో వరుణ యాగం నిర్వహించారు.
ఆలయాల్లో వరుణయాగం, ప్రత్యేక పూజలు
ఇచ్ఛాపురం/ఆమదాలవలస, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో వరు ణుడు కరు ణించాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మం గళవారం ఇచ్ఛాపురం, ఆమదాల వలసల్లో వరుణ యాగం నిర్వహించారు. ఇచ్ఛాపురం జగన్నాఽథ స్వామి ఆలయంలో ఈవో బెండు రామారావు ఆధ్వర్యంలో అర్చకులు పద్మ కుమార్, గోపాలకృష్ణ శాస్ర్తోక్తంగా వరుణ హోమం, ప్రత్యేక పూజ లు చేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి, టీడీపీ నేతలు సాలిన డిల్లీ యాదవ్, పత్రి తవిటయ్య, లీలారాణి, ఎస్.ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వేంక టేశ్వరస్వామి దేవాలయంలో వరుణ జపం, యాగం నిర్వహిం చారు. అర్చకులు గోపినంబాళ చైతన్యాచార్యు లు, సంతోషాచార్యులు, ఉమామహేశ్వరా చార్యుల ఆధ్వర్యంలో వరుణజపం, యాగం శాస్త్రోక్తంగా చేపట్టారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈవో సీహెచ్ ప్రభాకర్, పలువురు భక్తులు పాల్గొన్నారు.