Share News

వరుణుడి కోసం కప్పకు పూజలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:12 AM

వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ సోమ వారం వెలగాడలో కప్పకు పూజలు చేశారు.

వరుణుడి కోసం కప్పకు పూజలు
కప్పను ఊరేగిస్తున్న గ్రామస్థులు

జి.సిగడాం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ సోమ వారం వెలగాడలో కప్పకు పూజలు చేశారు. పసుపు గుడ్డలో కప్పను ఉంచి కావిడగా ఏర్పాటు చేసి ‘కప్ప కప్ప నీలాలు.. కడవళ్ల నిండా వర్షాలు’ అంటూ పాడుతూ వీధుల్లో ఊరేగించా రు. మహిళలు కప్పకు పసుపు నీళ్ల పోస్తూ వానలు కురవాలని మొక్కు కున్నారు. అనంతరం కప్పకు పూజలు చేసి చెరువులో విడిచిపెట్టారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు వర్షాలు కుర వాలని కోరుతూ కప్పకు పూజలు చేయడం ఆనవాయితీ అని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Jun 30 , 2026 | 12:12 AM