‘ఆదర్శనీయుడు ప్రకాశం పంతులు’
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:01 AM
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయుడని పలువురు వక్తలు అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయుడని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమాధికారి ఇ.అనూరాధ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో, ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు చూసిన తెగువ, చేసిన సేవలు చిరస్మరణీ యమన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏవో సూర్యనారాయణ, బీసీ వెల్ఫేర్ అధికారి త్రినాథ రావు, జోగారావు, శ్రీనివాస్ తదిత రులు పాల్గొన్నారు.
ఆంధ్రకేసరికి ఘన నివాళి
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఎస్పీ పి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయ మని, ఆయన ప్రజాసేవ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనమన్నారు. కార్య క్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.