Share News

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: ఎంపీ

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:46 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్క రించేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: ఎంపీ
వినతులు స్వీకరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్క రించేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు. మండలకేంద్రంలోని తన క్యాంపు కార్యా లయంలో శనివారం ప్రజా దర్బార్‌ నిర్వహించి సమస్యలపై వినతులు స్వీకరించారు. వినతులపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘పార్టీ కోసం పనిచేసే ప్రతి వ్యక్తికి మంచి భవిష్యత్‌’

టీడీపీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఎచ్చెర్ల నియో జకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయ వంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి బాబ్జి, ముప్పి డి సురేష్‌, కొమరాపు రవి, బెండు మల్లేశ్వరరావు, అన్నెపు భువ నేశ్వరరావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 11:46 PM