Share News

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: ఎంపీ

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:04 AM

కోట పాలెం గ్రామంలో ఆదివారం విజయనగరం ఎ పీ కలిశెట్టి అప్పల నాయుడు ప్రజాదర్బార్‌ నిర్వ హించి స్థానికుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: ఎంపీ
కోటపాలెంలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న ఎంపీ కలిశెట్టి, సీనియర్‌ నేత అసిరినాయుడు

రణస్థలం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కోట పాలెం గ్రామంలో ఆదివారం విజయనగరం ఎ పీ కలిశెట్టి అప్పల నాయుడు ప్రజాదర్బార్‌ నిర్వ హించి స్థానికుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. అంతకుముందు ఫాదర్స్‌ డే కావడంతో టీడీపీ సీనియర్‌ నాయకుడు గొర్లె అసిరి నాయుడుకు పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

టీడీపీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కోట పాలెంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం విజయం సాధించేలా పనిచేయా లన్నారు. కూటమి నాయకులను సమన్వ ుం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చైదరి అవినాష్‌, నేతలు లంక శ్యామల రావు, కనకారావు, పిషిని జగన్నాఽథం నాయుడు, కలిశెట్టి సూర్యనారాయణ, సుంకరి ధనుంజయ రావు, తదితరులు పాల్గొన్నారు.

‘పేదలకు ఆసరా సీఎంఆర్‌ఎఫ్‌’

జి.సిగడాం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆసరాగా నిలుస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆనందపురం పంచా యతీ ఆబోతులపేటకి చెందిన టీడీపీ కార్యకర్త మొయ్యి రామారావు ఇటీవల బ్రైన్‌కు సంబం ధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇతనికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.82 వేలు మంజూరు కాగా ఈ చెక్కును ఎంపీ ఆదివారం ఆయన కు టుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో నాయకులు పొగిరి నారాయణరావు, చిత్తిరి తిరు పతిరావు, మొయ్యి రాము, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 12:04 AM