Share News

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: కలిశెట్టి

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:17 AM

ప్రజల సమస్య లు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌: కలిశెట్టి
రణస్థలం: సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు పత్రాన్ని అందిస్తున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి

రణస్థలం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్య లు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాల యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు. అనా రోగ్యంతో బాధపడుతున్న జీరుపాలెం గ్రామానికి చెందిన దుమ్ము పుష్ప వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.3 లక్షల మంజూరు పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి బాబ్జి, ముప్పిడి సురేష్‌, లంక శ్యామ్‌, కలిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: రవికుమార్‌

ఆమదాలవలస, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్ర మంలో టీడీపీ నేతలు తమ్మినేని చంద్రశేఖర్‌, తమ్మినేని గీతా విద్యాసాగర్‌, సిమ్మ మాధవి, ఎస్‌.మురళీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:17 AM