సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: కలిశెట్టి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:01 AM
గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కచడమే ప్రజా దర్బార్ లక్ష్య మని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు అన్నారు.
లావేరు, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కచడమే ప్రజా దర్బార్ లక్ష్య మని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు అన్నారు. సోమవారం గుమ డాంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం లో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరో పించారు. గుమడాంలో తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు వినతి పత్రాలు అందించారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐ.తోటయ్యదొర, నాయకులు లంక నారాయణరావు, ఆరెళ్ల కృష్ణ, పిన్నింటి మధుబాబు, దుర్గాశి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.