Share News

సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:08 AM

ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని సత్వరం పరిష్కరిండమే ప్రజా దర్బార్‌ లక్ష్యమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారానికే  ప్రజా దర్బార్‌
వినతులను స్వీకరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని సత్వరం పరిష్కరిండమే ప్రజా దర్బార్‌ లక్ష్యమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వారం రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుం దని, ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త, నాయకుడిపై ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్ర వారం తన క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్‌, డీజీఎం ఆనందరావు, కనకారావు, కొమరాపు రవి, బెండు మల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వర్‌, రజిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గురజాపు రాము, భానోజి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:08 AM