సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - May 10 , 2026 | 11:52 PM
ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబబొమ్మాళి, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం ప్రజలతోపాటు నందిగాం మండల ప్రజానీకం నుంచి వివిధ సమస్యలపై వినత పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. ఆయన ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మండలం పెద్దబమ్మిడి గ్రామంలో నిర్వహిస్తున్న కోదండరామాలయ వార్షికోత్సవానికి హాజరుకావాలని ఆ గ్రామస్థులు మంత్రికి ఆహ్వానపత్రిక అందించారు. టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శిమ్మ నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.