సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:03 AM
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
- విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రణస్థలం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వేల్పురాయి గ్రామంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పెద్ద చెరువు ఆక్రమణ తొలగించాలని, కొంతమంది జిరాయితీ భూములను అక్రమించారని, వాటిని సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని, గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని, ఇళ్ల బిల్లులు మంజూరు చేయాలని, వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని పలువురు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు బాలి శ్రీనివాసరావు, బాలి రామినాయుడు, కనకారావు, పిన్నింటి భానూజినాయుడు తదితరులు పాల్గొన్నారు.
వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే శంకర్
అరసవల్లి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని విశాఖ-ఏ కాలనీలో ఉన్న తన కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే ప్రజల నుంచి వినతు లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, రహదా రులు, పింఛన్లు, విద్యుత్తు సమస్యల వంటి వాటిపై ప్రజలు ఎక్కువగా ఫిర్యా దులు చేస్తున్నారని తెలిపారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో..
ఆమదాలవలస, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తున్నామని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన ప్రజలు హాజరై పలు సమస్య లపై అర్జీలు సమర్పించారు. కొన్ని అర్జీలపై ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పీవీకే రాజు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంపతిరావు మురళీ, నాయకులు పాల్గొన్నారు.