Share News

భూ సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:34 PM

భూసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌
అధికారులతో కలిసి వినతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు:

పాతపట్నం/రూరల్‌, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వసేవలు అందించేందుకే అధికారులతో శాఖవారీగా సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రెవెన్యూసదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసంబంధిత సమస్యలు, పట్టా దారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులు, భూహద్దుల వివరాలు తదితర సమస్యల ను ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్జీని పరిశీలిం చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కృష్ణమూర్తికి సూచించారు. పాసుపుస్తకాల్లో సవరణలు, మ్యూటేషన్‌ తదితర సమస్యలపై 516 వినతులు అందాయనిఅధికారులు తెలిపారు. కార్యక్రమంలో పాతపట్నం, కొత్తూరు, ఎల్‌ఎన్‌ పేట, హిరమండలం, మెళియాపుట్టి తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:34 PM