గేట్ ఫలితాల్లో సత్తా
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:20 AM
GATE results గేట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సంతబొమ్మాళి మండలం కాశీపురానికి చెందిన పూడి అభిషేక్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఎలక్ర్టిక్ విభాగంలో ఆలిండియాలో 244వ ర్యాంకు సాధించాడు.
సంతబొమ్మాళి/ పొందూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): గేట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సంతబొమ్మాళి మండలం కాశీపురానికి చెందిన పూడి అభిషేక్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఎలక్ర్టిక్ విభాగంలో ఆలిండియాలో 244వ ర్యాంకు సాధించాడు. అభిషేక్ తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. అలాగే పొందూరు మండలం ధర్మపురానికి చెందిన మొదలవలస రాజ్‌కుమార్ జాతీయస్థాయిలో 248వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ధన్‌బాద్‌లో ఐజీటీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్(ఏఐ), డేటాసైన్స్‌లో పరిశోధన చేస్తున్నాడు. రాజ్‌కుమార్ తండ్రి గోవిందరావు మెడికల్ బిజినెస్ చేస్తుండగా.. తల్లి గృహిణి. అలాగే సంతబొమ్మాళి మండలం గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్‌కుమార్ సీఎస్‌ఈ విభాగంలో ఆలిండియాలో 544వ ర్యాంక్ సాధించాడు. వెన్నెలవలస నవోదయ పాఠశాల్లో ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం భీమవరం విష్ణు కాలేజీలో బీటెక్ సీఎస్‌ఈలో చదువుతూ గేట్‌లో ఎంట్రన్స్‌లో తొలి ప్రయత్నంలోనే సాధించాడు. ఇలా పలువురికి మంచి ర్యాంకులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.