Share News

అమరజీవి త్యాగం.. మరువలేనిది

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:28 AM

Potti Sriramulu's Jayanthi ఆంధ్రరాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పాత బస్టాండు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అమరజీవి త్యాగం.. మరువలేనిది
పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే శంకర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పాత బస్టాండు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్జీవో హోమ్‌లో ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేశారు. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ఉద్యోగానికి రాజీనామా చేసి, గాంధీజీ స్ఫూర్తితో పొట్టి శ్రీరాములు.. తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారని కొనియాడారు. అనంతరం సఖి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఎంజే బాబు, పైడిశెట్టి జయంతి, బీసీ సంక్షేమాధికారి అనూరాధ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ గడ్డెమ్మ, తహసీల్దార్‌ గణపతిరావు, మోప్మా పీడీ వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 12:28 AM