Share News

రోడ్డు మధ్యలో గోతులు ఏర్పడి.. గోడలు బీటలు వారి

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:05 AM

మండంలోని సింగుపురం పం చాయతీపరిధిలోని బళ్లఖానా దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోకపో వడంతో శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే ఈ ఖానాకు ఇరువైపులా ఉండే రక్షణ గోడలు బీటలు వారాయి.

 రోడ్డు మధ్యలో  గోతులు ఏర్పడి.. గోడలు బీటలు వారి
శిథిలావస్థకు చేరిన బళ్లఖానా

పాతపట్నం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మండంలోని సింగుపురం పం చాయతీపరిధిలోని బళ్లఖానా దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోకపో వడంతో శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే ఈ ఖానాకు ఇరువైపులా ఉండే రక్షణ గోడలు బీటలు వారాయి. ఖానా, రోడ్డుకు మధ్య గోతులు ఏర్పడడం తో ఏమరపాటుగా వెళ్లే సమయంలో వాహనచోదకులు తరచూ ప్రమా దాలకు గురవుతున్నారు. బళ్లఖానా గుండా పొగడవిల్లిగెడ్డ నుంచి వచ్చే నీటిని సింగుపురం పంచాయతీపరిధిలోని గ్రామాలతోపాటు ధనుపురం వరకూ దిగువప్రాంతాలకు సాగునీరువెళ్తోంది. ఈఖానా మీదుగా దేవుద ళ, కొంచాడపేట, చిన్నమల్లిపురం తదితర గ్రామాలతో పాటు హిరమం డలం, సారవకోట మండలాల్లోని పలు గ్రామాలకు మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఏక్షణంలోనైనా ఖానా కూలిపోతే రాకపోకలకు నిలిచిపోయే ప్రమాదముందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఖానాకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:05 AM