వీఆర్‌లో ఉన్న 12 మంది ఎస్‌ఐలకు పోస్టింగ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:02 AM
జిల్లాలోని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న 12 మంది ఎస్‌ఐలకు వివిధ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న 12 మంది ఎస్‌ఐలకు వివిధ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పి.శంకరరావుకు డీఎస్‌బీ శ్రీకాకుళం, టి.సన్యాసి రావుకు శ్రీకాకుళం మహిళా పోలీసుస్టేషన్, బి.కృష్ణారావు, పి.రఘునాథ రావులకు శ్రీకాకుళం కంట్రోల్ రూమ్, పి.శ్రీనివాసరావుకు డీసీఆర్‌బీ శ్రీకా కుళం కేటాయించారు. పి.తవుడును ఎచ్చెర్లకు, పి.అప్పలరెడ్డిని మందస కు, వి.లక్ష్మీనారాయణను నరసన్నపేటకు, ఎ.గౌరీశంకర్‌కు పైడి భీమవరం చెక్ పోస్టు వద్ద సిస్కోకు, ఆర్.నర్సింహమూర్తికి డీటీఆర్‌బీ సీఎంఎస్, పి. రమేష్‌బాబుకు ఆర్థిక నేరాల విభాగం, కె.రాముకు సైబర్ క్రైమ్‌లో పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.