Share News

జోరుగా పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:00 AM

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గోనున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈమేరకు సోమవారం మండలపరిషత్‌ కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ జోరుగా జరిగింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులు బారులుతీరారు.

జోరుగా పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌
జలుమూరు: పోస్టల్‌ బ్యాలట్‌ కోసం బారులుతీరిన ఉద్యోగులు:

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గోనున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈమేరకు సోమవారం మండలపరిషత్‌ కార్యాలయాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ జోరుగా జరిగింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులు బారులుతీరారు.

ఫఎల్‌.ఎన్‌.పేట, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం లోని పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు వేసే పోలింగ్‌ కేంద్రం వద్ద ఓట్లు వేసేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సివచ్చిందని పలువురు ఓటర్లు అసహనం వ్యక్తంచేశారు. ఉదయం 11 గంటలకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చామని, సాయంత్రం ఐదు గంటలవరకు లైనులో నిలబడవలసి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.

ఫ పోలాకి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలాకి మండల పరిషత్‌ కార్యాలయంలో బ్యాలట్‌ కేంద్రంలో ఆర్వో వెంకటమధు, ఎంపీడీవో బలగప్రకాష్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీకార్యకర్తలు, వసతిగృహ సంక్షేమాధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు అవకాశముందని ఆర్వో తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో బట్టపద్మావతి, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:00 AM