Share News

లక్ష క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:31 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసి వంశధారనదికి లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశముందని తహసీల్దార్‌ జె.రామారావు తెలిపారు.

లక్ష క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం
జలుమూరు: ఉప్పరపేటలో తుఫాన్‌పై గ్రామస్థులకు అప్రమత్తం చేస్తున్న తహసీల్దార్‌ రామారావు

  • వంశధార తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • జలుమూరు తహసీల్దార్‌ రామారావు

జలుమూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసి వంశధారనదికి లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశముందని తహసీల్దార్‌ జె.రామారావు తెలిపారు. దీంతో నదీతీర గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సోమవారం మండలంలోని కొమనాపల్లి, అచ్యుతాపురం, సురవరం, మాకివలస, అంధవరం, ఉప్పరపేట, జోగులపేట పర్లాం తదితర వంశధార తీరగ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తంచేశారు. ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉండ డంతో పురిళ్లలో ఉన్న కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వంశధార నదికి వరదలు వచ్చే అవకాశమున్నందున ప్రజానీకం నదికి స్నానాలకు వెళ్లకుండా, పశువులు, గొర్రెలు, మేకలు నదివైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీఎంపీడీవో ఉమామహేశ్వరరావు,ఎస్‌ఐ అశోక్‌బాబు పాల్గొన్నారు.

ప్రజలు బయటకు రావొద్దు

హిరమండలం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతోపాటు గాలులు వీచే అవకాశముందని, ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని కొత్తూరు సీఐ ప్రసాదరావు, తహసీల్దారు బాలకృష్ణ సూచించారు. శనివారం మండలంలోని రెల్లివల సలో తుఫాన్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజ్‌గోపాల్‌, ఎస్‌ఐ మధుసూదనరావు పాల్గొన్నారు.

పూరిగుడిసెల్లో ఉండొద్దు

పాతపట్నం/రూరల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): చంగుడి, కె.గోపాలపురం, హెచ్‌. గోపాలపురం లోతట్టు గ్రామాల్లో తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పునరావాసకేంద్రాల ఏర్పాటుపై మండల ప్రత్యేకాధికారి బి. విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం పాతపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం చంగుడి, కె.గోపాలపురం, హెచ్‌. గోపాలపు రం సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. పూరిగుడిసెలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండవద్దని సూచించారు. ఆమెవెంట తహసీల్దార్‌ బి.వెంకటరమణ, ఎంపీడీవో రమణమూర్తి, ఎస్‌ఐ మధుసూదనరావు ఉన్నారు. కాగా పాతపటంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీవో రమణమూర్తి, మండల ప్రత్యేకాధికారి కృష్ణారావు, టెక్కలి గనులు, భూగర్భ శాఖ ఏడీ ఆధ్వర్యంలో సమీక్షించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:31 AM