చోరీ సొత్తు స్వాధీనం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:49 PM
ఈనెల 25న మున్సిపాల్టీ పరిధిలోని ఏఎస్ పేటకు చెందిన కదంబాల భాగ్యలక్ష్మి మార్కెట్‌లో సామాన్లు కొనుగోలు చేసేందుకు ఇచ్ఛాపురం వచ్చారు.
ఇచ్ఛాపురం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఈనెల 25న మున్సిపాల్టీ పరిధిలోని ఏఎస్ పేటకు చెందిన కదంబాల భాగ్యలక్ష్మి మార్కెట్‌లో సామాన్లు కొనుగోలు చేసేందుకు ఇచ్ఛాపురం వచ్చారు. మార్కె ట్ జంక్షన్ వద్ద సామాన్లు కొనుగోలు చేస్తున్న సమయంలో తన బ్యాగ్‌లో ఉన్న ఆరు తులాల పావు బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈమేరకు శనివారం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా అస్కా కె.నవాపల్లికి పురు శుభాష్ అనే మహిళను ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. నిందితురాలిని పట్టుకున్న విషయంలో కానిస్టేబుల్ బషీర్ మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు.
గంగువాడలో చోరీ
పాతపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): గంగువాడ గ్రామంలోని బ్యాంక్ ఉద్యోగి చల్లా త్రినాథరావు ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే గంగువాడ ఎస్‌బీఐలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న చల్లా త్రినాథరావు వరుస నాలుగు రోజులు బ్యాంక్‌కు సెలవులు రావడంతో స్వగ్రామమైన జలుమూరు మండలం పాగోడు గ్రామానికి వెళ్లారు. శనివారం ఉదయం గ్రామస్థులు గంగువాడలో గల తన ఇంటి తలుపుతెరచి ఉందని తెలపడంతో ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.4వేల విలువచేసే వెండి వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ మధుసూదనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.