Share News

జీతాల కోసం పోర్టు వాహన సిబ్బంది నిరసన

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:40 PM

మూలపేట పోర్టు వాహన సిబ్బంది జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్‌ వాటర్‌ ట్యాంక్‌, మెస్‌కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.

జీతాల కోసం పోర్టు వాహన సిబ్బంది నిరసన
నిరసన తెలుపుతున్న పోర్టు సిబ్బంది:

సంతబొమ్మాళి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు వాహన సిబ్బంది జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్‌ వాటర్‌ ట్యాంక్‌, మెస్‌కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని.... అడిగిన ప్రతిసారి కుంటిసాకులు చెప్పి పోర్టు యాజమాన్యం కాలయాపన చేస్తోందని వాహన సిబ్బంది మండిపడ్డారు. ఇలా ప్రతిసారి నిరసన వ్యక్తం చేస్తున్నా పోర్టు యాజమాన్యం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆర్థిక కష్టాలను తెలియజేసేందుకే తాగునీరు, ఆహారాన్ని పోర్టు యాజ మాన్యానికి అందకుండా వాహనాలతో అడ్డు కున్నామని నిరసన కారులు తెలిపారు. పోర్టు ప్రతినిధులు వచ్చి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Updated Date - Aug 21 , 2026 | 11:40 PM