Share News

ఇచ్ఛాపురంలో పోర్టు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:18 AM

Measures to set up a port at Ichchapuram ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పోర్టు నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో రూ.6కోట్లతో నిర్మిస్తున్న రెండు రైల్వే అండర్‌బ్రిడ్జిలు, రూ.2.29కోట్ల వ్యయంతో రాజావారి మైదానంలో బ్యాడ్మింటన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఇచ్ఛాపురంలో పోర్టు
స్టేడియం పనులు ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

2వేల ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు

అనుబంధ పరిశ్రమలు వచ్చేలా కార్యాచరణ

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఆర్వోబీలతోపాటు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పోర్టు నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో రూ.6కోట్లతో నిర్మిస్తున్న రెండు రైల్వే అండర్‌బ్రిడ్జిలు, రూ.2.29కోట్ల వ్యయంతో రాజావారి మైదానంలో బ్యాడ్మింటన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘ఇచ్ఛాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇక్కడి తీరప్రాంతంలో 2వేల ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. పోర్టు నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున అనుబంధ పరిశ్రమలు, సంస్థలు వస్తాయి. ఇచ్ఛాపురంలో మరో రైల్వేవంతెనకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. అరాచకం, దౌర్జన్యం, దాడులతో వైసీపీ పాలన కొనసాగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. రాజావారి మైదానంలో అన్ని వసతులతో బ్యాడ్మింటన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తాం. రైల్వేట్రాక్‌ ఇబ్బందులు తొలగించేలా.. రెండు ఆర్వోబీలకు శంకుస్థాపన చేశాం. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ను అమృత్‌భారత్‌ పథకం కింద ఆధునికీకరిస్తున్నాం. దీంతోపాటు కొత్త రైల్వే హాల్ట్‌లు కూడా తీసుకొచ్చాం. రైల్వేజోన్‌ మార్పు చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇకపై రైల్వే సమస్యలపై నేరుగా డీఆర్‌ఎంకు కలిసే అవకాశం దొరికింది. ఏళ్ల తరబడి రోడ్లు లేని ఇంటీరియల్‌ గ్రామాలకు కూడా బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులు చేపట్టాం. ఐదేళ్లుగా నిలిచిపోయిన ఇచ్ఛాపురం కేవీకేకు శంకుస్థాపన చేశాం. ఇందులో 3కోర్టులు బ్యాడ్మింటన్‌, జిమ్‌, అఽధ్లెటిక్‌ ట్రాక్‌, ఆకింగ్‌ ట్రాక్‌ ఉంటాయి. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలోని 7నియోజకవర్గాలలోనూ కేవీకేలు మంచి ఇన్‌ఫ్రాస్టెక్చర్‌తో స్టేడియాలు నిర్మించటమే నా లక్ష్యమ’ని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం పి.రామారావు, సీనియర్‌ డీసీఎం పవన్‌కుమార్‌, డీఈఓ రాజు, ఎల్‌ఓడబ్ల్యూ ముళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, జడ్‌ఆర్‌యూసీసీ మెంబర్‌ శ్రీనువాసరౌలో, రెడ్డిక కార్పోరేషన్‌ చైర్మన్‌కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన డిల్లీ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, ఎన్‌.కోటి, కాళ్ల ధర్మారావు, కాళ్ల జయదేవ్‌, కాళ్ల దిలీప్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:18 AM