Share News

సంక్షేమ పథకాలతో ఆదరణ

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:54 PM

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... పాలన తీరుతో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 సంక్షేమ పథకాలతో ఆదరణ
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... పాలన తీరుతో ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అక్కుపల్లిలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ ఎంపీటీసీ సభ్యుడు బర్రి భూపతి, కాస సోమేశ్వరరావు, కాస ముకుందరావు, కాస వెంకటస్వామి, లండ కృష్ణ, చొక్కరి గురురాజు, చొక్కరి లక్ష్మి తదితరులు వైసీపీని వీడి...టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు వేసి... ఎమ్మెల్యే గౌతు శిరీష ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అభివృద్ధి... సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుచ్చ శోభారాణి, మండల టీడీపీ అధ్యక్షులు సూరాడ మోహనరావు, సింగుపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:54 PM