పాలిసెట్‌ను పక్కాగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:15 AM
పలాస-కాశీ బుగ్గలో శనివారం నిర్వహించనున్న పాలిసెట్‌ను పక్కాగా నిర్వహించాలని డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పర్యవేక్షణాధికారి ఎంఏవీ రామకృష్ణ అన్నారు.
జిల్లా పర్యవేక్షణాధికారి రామకృష్ణ
కాశీబుగ్గ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీ బుగ్గలో శనివారం నిర్వహించనున్న పాలిసెట్‌ను పక్కాగా నిర్వహించాలని డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పర్యవేక్షణాధికారి ఎంఏవీ రామకృష్ణ అన్నారు. శుక్ర వారం జంట పట్టణాల్లో పాలిసెట్‌కు కేటాయించిన తొమ్మిది కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారు లకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు మొదల వుతూ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుం దన్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు ఉదయం 9 గంటలకే చేరుకోవాలని అన్నారు. ఈ తొమ్మిది కేంద్రాల్లో 2,441 మంది విద్యార్థులు పరీక్ష రాయ నున్నారన్నారు. ముఖ్యంగా కేంద్రాల అన్ని వసతు లు కల్పించాలని సూచించారు. పాలిసెట్‌కు నియ మించిన సీఎస్, జాయింట్ సీఎస్, అబ్జర్వర్స్, రూట్ ఆఫీసర్స్ పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చాలని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా చూసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్‌పాల్, పలాస కాశీబుగ్గ టౌన్ అబ్జర్వర్ రాజేశ్వరి, టౌన్ కోఆర్టినేటర్ కె.ఎమునా, అసిస్టెంట్ కోఆర్టినేటర్ చిన్నంనాయుడు తదితరులు ఉన్నారు.