పోలింగ్ ప్రశాంతం...
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:31 AM
Municipality elections in palasa, ichhapuram జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇచ్ఛాపురంలో 65.55 శాతం, పలాస- కాశీ బుగ్గ మునిసిపాలిటీలో 70.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఇచ్ఛాపు రంలో ఆదివారం ఉదయం 7 గంటలకు మందకొడిగా పోలింగ్ ప్రారంభ మైంది.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 65.55 శాతం..
పలాస-కాశీబుగ్గలో 70.13 శాతం ఓటింగ్
రాష్ట్ర పరిశీలకులు, కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలన
భద్రంగా స్ట్రాంగ్‌రూములకు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు
శ్రీకాకుళం/ ఇచ్ఛాపురం/, పలాస/ కాశీబుగ్గ/పలాస రూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇచ్ఛాపురంలో 65.55 శాతం, పలాస- కాశీ బుగ్గ మునిసిపాలిటీలో 70.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఇచ్ఛాపు రంలో ఆదివారం ఉదయం 7 గంటలకు మందకొడిగా పోలింగ్ ప్రారంభ మైంది. తొలి రెండు గంటల్లో కేవలం 5 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నానికి క్రమేపీ ఊపందుకుంది. 12 గంటల సమయానికి 20 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 1 గంట తరు వాత ఎక్కువగా ఓటింగ్ జరిగింది. 17 ప్రాంతాల్లో 39 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలో మొత్తం 31,452 మంది ఓటర్లకుగానూ 20,616 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. 24 వార్డు ఏకగ్రీవం కావడంతో అక్కడ చైర్‌పర్సన్ అభ్యర్థులకు మాత్రమే ఓటింగ్ జరిగింది. పురుషోత్తపురం ఏపీ మోడల్ స్కూల్ వద్ద స్ర్టాంగ్‌రూంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం అత్యంత పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ర్టాంగ్‌రూంలకు తరలించారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు. ఇద్దరు డీఎస్పీలతోపాటు సీఐలు, ఎస్‌ఐల నేతృత్వంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్ చేశారు.
రత్తకన్న, కండ్రవీది, బెల్లుపడ కాలనీ, ఏఎస్‌పేట, పురుషోత్తపురం పోలింగ్ కేంద్రాలను, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పరిశీలించారు.
90ఏళ్ల వృద్ధురాలు కళ్లేపల్లి సుబ్బలక్ష్మి తమ ఓటుహక్కును వినియోగించుకు న్నారు. కోడలు సాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని.. ఓటు వేశారు.
పలాసలో 70.15 శాతం
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లో మొత్తం 36 వార్డులకుగానూ 67 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 49,420 మంది ఓటర్లకుగానూ 34, 667 మంది ఓటుహక్కు వినియో గించుకున్నారు. 70.15 శాతం పోలిం గ్ నమోదైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారం భమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ ముగియాలి. అయితే మూడు కేంద్రాల్లో 891 మంది ఓటర్లు క్యూలో ఉన్న సమయంలో గడువు ముగిసింది. నిబందనల ప్రకారం వారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్ కేంద్రం గేట్లు మూసివేశారు. లోపల ఉన్న వారంతా ఓటుహక్కు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రి 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం బ్యాలెట్‌బాక్స్‌లను భారీ భద్రత నడుమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూములకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి, కమిషనర్ ఇ.శ్రీనివాసులు పర్యవేక్షించారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల తీరును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నల్లవరపు సూర్యతేజ, కలెక్టర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్, ఎస్పీ కెవి.మహేశ్వరరెడ్డి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రమైన చిన్నబడాం, కాశీబుగ్గ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. ఏఎస్పీ వివేకానంద, కాశీబుగ్గ డీఎస్పీ జివి.రమణ ప్రత్యేక పోలీసు బృందాలతో మొత్తం అన్నీ పోలింగు కేంద్రాలను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. మీడియాను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా నియంత్రించడం విశేషం. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
పలాస ప్రభుత్వ ఉన్నతపాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త పలాస నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకన్నచౌదిరి ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని, ఆమె భర్త ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాళాసు శ్రీపద్మ కూడా అక్కడే ఓటు వేశారు. మాజీమంత్రి గౌతు శ్యామసుందరశివాజి, అతని భార్య గౌతు విజయలక్ష్మి కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
వైసీపీ నాయకుల అరెస్టులు
పలాస-కాశీబుగ్గలో పోలింగ్ కేంద్రాల వద్ద గలాటా సృష్టించిన వైసీపీ అభ్యర్థుల భర్తలతో పాటు వారి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. 11వ వార్డు శివాజినగర్‌కాలనీ (పద్మనాభపురం)లో వార్డు వైసీపీ అభ్యర్థి మీసాల సుశోభిత భర్త.. ఆ వార్డు మాజీ వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, వైసీపీ నాయకులు వి.లక్ష్మణరావు, బి.రవిని పోలీసులు అరెస్టు చేసి వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నబడాం 6 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దువ్వాడ సత్యవతి భర్త దువ్వాడ రమణయ్యతో పాటు వారి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వీరిపై బైండోవర్‌తో పాటు రౌడీషీటు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులను బెదిరించడం, అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడం వంటి కారణాలపై వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జివి.రమణ తెలిపారు.
మాజీమంత్రి సీదిరి అప్పలరాజు వార్డుల్లో పర్యటించేందుకు సిద్ధం కాగా, ఇక్కడ ఓటుహక్కు లేనందున పర్యటించవద్దని పోలీసులు చెప్పడంతో ఆయన ఇంటికి పరిమితమయ్యారు.
19, 21 వార్డుల్లో టీడీపీ నాయకులు తమ టెంట్లు తిరగేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
గత ఎన్నికల కన్నా తగ్గిన ఓట్ల శాతం
పలాస-కాశీబుగ్గలో గత మున్సిపల్ ఎన్నికలు కన్నా ఈసారి ఎన్నికల్లో 3.05 శాతం ఓట్లు తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 31వార్డులకుగాను 42,836 మంది ఓటర్లు ఉండగా అందులో 31,356 ఓటుహక్కు వినియోగించుకున్నారు. 73.20శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 36 వార్డుల్లో 49,420 మంది ఓటర్లు ఉండగా 34,667 మంది(70.15శాతం) ఓటేశారు.