పోలాకి మండల ఓటర్లు 54,567
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:37 PM
మండలంలోని 31 పంచాయతీల్లో 54,567మంది ఓటర్లు ఉన్నట్లు ఈవోపీఆర్‌డీ, డిప్యూటీ ఎంపీడీవో బట్ట పద్మావతి తెలిపారు.
పోలాకి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి):మండలంలోని 31 పంచాయతీల్లో 54,567మంది ఓటర్లు ఉన్నట్లు ఈవోపీఆర్‌డీ, డిప్యూటీ ఎంపీడీవో బట్ట పద్మావతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం తుది జాబితాను విలేకరులకు వెల్లడించారు. అంపలాం పంచాయతీలో 2057 మంది, బెలమరపాలవలసలో 2081, బొద్దాం 1671, చెల్లాయివలస 2062, చీడివలస 2176, దండులక్ష్మీపురం 1440, దీర్గాశి 2270, డోల 1084, ఈదులవలస 1032, గంగివలస 1036, గాతలవలస 2330, గొల్లలవలస 1632, గుప్పెడుపేట 2240, జడూరు 984, కోడూరు 838, కొత్తరేవు, 2629, కే.పీ.వలస 1068, మబగాం 3368, పల్లిపేట 1214, పిన్నింటిపేట 1870, పిరువాడ 1235, పోలాకి 4417, ప్రియాగ్రహారం 2328, రహిమాన్‌పురం 1719, రాజపురం 915, రాళ్లపాడు 937, ఎస్.ఎల్.పురం 789, సుసరాం 1439, తలసముద్రం 1848, ఉరజాం 1731, వనితమండలం పంచాయతీలో 1297 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 54,567 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 27,490మంది, మహిళలు 27,076 ఉన్నారు. మండలం మొత్తం 298 వార్డులు ఉన్నాయని ఆమె వివరించారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు ఇదే జాబితా ప్రకారం ఓటర్లు ఓట్లు వేసేందుకు ఉన్నతాధికారులకు జాబితాలు పంపించినట్లు తెలిపారు.