Share News

‘అవగాహనతోనే పోలియో నివారణ’

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:36 PM

పోలియో వ్యాధి నివారణపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండా లని రోటరీక్లబ్‌ శ్రీకాకుళం, శ్రీకాకుళం సైక్లింగ్‌ క్లబ్‌ ప్రతినిధులు అన్నారు.

 ‘అవగాహనతోనే పోలియో నివారణ’
సైకిల్‌ ర్యాలీ చేపడుతున్న రోటరీ, సైక్లింగ్‌ క్లబ్‌ ప్రతినిధులు

శ్రీకాకుళం కల్చరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలియో వ్యాధి నివారణపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండా లని రోటరీక్లబ్‌ శ్రీకాకుళం, శ్రీకాకుళం సైక్లింగ్‌ క్లబ్‌ ప్రతినిధులు అన్నారు. ప్రపంచ పోలియో దినం సందర్భంగా శనివారం నగరంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి, సూర్యమహల్‌, పసగాడ మిల్లు జంక్షన్‌, డే అండ్‌ నైట్‌, చిన్నబజార్‌ మీదుగా అవగాహ నకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు నటు కుల మోహన్‌, నేతాడ వెంకటరావు, ఎంఆర్‌కే దాస్‌ మాట్లాడుతూ.. మన దేశంలో పోలియో ఒక్క కేసు నమోదు కాకపోయినా పొరు గున ఉన్న పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాల్లో ఇంకా ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. పోలియో రహిత సమాజమే అందరి ధ్యేయం కావాలన్నారు. కార్యక్రమంలో సైక్లింగ్‌క్లబ్‌ ప్రతినిధులు కాపవరపు సీజు, సురేష్‌, ఊన్న షర్మిల, జామి మణి, రోటరీ ప్రతినిధులు దేవరశెట్టి శివ శంకర్‌, బరాటం శ్రీనివాస్‌, పసగాడ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:36 PM