పోలియో నిర్మూలన మన బాధ్యత
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:25 AM
Pulse Polio successful ‘ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన మనందరి బాధ్యత’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని హెచ్‌బీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో డీఎంహెచ్‌వో అనితతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన మనందరి బాధ్యత’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని హెచ్‌బీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో డీఎంహెచ్‌వో అనితతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలియోతో ఏ ఒక్క చిన్నారీ బాధపడరాదని, తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారు, ప్రజలందరూ ఇందుకు సహక రించాలని కోరారు. అలాగే శ్రీకాకుళంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవన్ వద్ద పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత ప్రారంభించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ‘ఐదేళ్లలోపు చిన్నారుల భవిష్యత్‌కు పోలియో చుక్కలు శ్రీరామ రక్ష. జిల్లాలో పల్స్‌పోలియో శతశాతం లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తిచేశాం. మొదటిరోజు ఆదివా రం నిర్దేశిత బూత్‌లలో పోలియోచుక్కలు వేస్తాం. ఏదైనా అనివార్య కారణాల వలన రాలేని పిల్లలకు మిగిలిన రెండు రోజుల పాటు సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి వ్యాక్సిన్ వేస్తారు. పోలియోరహిత సమాజానికి అందరూ సహకరించాల’ని కోరారు. కార్యక్రమంలో ఏడీఎం హెచ్‌వో డా.టి.శ్రీకాంత్, డీఐఎం డా.రాందాసు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్వరూప్, రోటరీ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్ పాల్గొన్నారు.