తొమ్మిది కేంద్రాల్లో పాలిసెట్
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:17 AM
ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న పాలిసెట్ పలాస-కాశీబుగ్గలో తొమ్మిది కేంద్రాలు కేటయించినట్టు డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పర్యవేక్షణాధికారి ఎంఏవీ రామకృష్ణ అన్నారు.
ఈ నెల 25న పరీక్ష
పర్యవేక్షణాధికారి ఎంఏవీ రామకృష్ణ
కాశీబుగ్గ, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న పాలిసెట్ పలాస-కాశీబుగ్గలో తొమ్మిది కేంద్రాలు కేటయించినట్టు డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పర్యవేక్షణాధికారి ఎంఏవీ రామకృష్ణ అన్నారు. బుధవారం కాశీబుగ్గ హైస్కూల్‌లో సీఎస్, జాయింట్ సీఎస్, అబ్జర్వర్స్‌కు, రూట్ ఆఫీసర్స్‌కు పరీక్ష నిర్వహణ పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలాస కాశీబుగ్గలో తొలిసారిగా పాలిసెట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పలాస కాశీబుగ్గ లో తొమ్మిది కేంద్రాలు కేటయించామని తెలిపారు. కాశీబుగ్గ హైస్కూల్, పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల, పలాస హైస్కూల్, విద్యావాహిని జూనియర్, డిగ్రీ కళాశాల, శ్రీగురుకుల విద్యాలయం, నారాయణ టెక్నో స్కూల్, సూర్యతేజ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహి స్తామని అన్నారు. 25వ తేదీన శనివారం పాలీసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందని, విద్యార్థులు కేంద్రాలు వద్దకు 9 గంటలకు చేరుకోవాలని కోరారు. విద్యార్ధులు ఆధార్ కార్డు, హాల్ టికెట్ తీసుకుని రావాలని, ఒక్క సెకన్ ఆ లస్యమైనా అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ తొమ్మి ది కేంద్రాల్లో 2,441 మంది విద్యార్థులు పరీక్ష రాయను న్నట్టు తెలిపారు. శిక్షణ తరగతుల్లో శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్‌పాల్, పలాస-కాశీబుగ్గ టౌన్ కోఆర్టినేటర్ కె.ఎమునా, అసిస్టెంట్ కోఆర్టినేటర్ చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.