Share News

పేకాట శిబిరాలపై పోలీసుల దాడి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:45 PM

నగరంలో రెండు చోట్ల జరుగుతు న్న పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేపట్టారు.

పేకాట శిబిరాలపై పోలీసుల దాడి

  • 12 మంది అరెస్టు

  • రూ.31,740 స్వాధీనం

శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): నగరంలో రెండు చోట్ల జరుగుతు న్న పేకాట శిబిరాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేపట్టారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.31,740 స్వాధీనం చే సుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సరంగడోలా వీధి, వాంబే కాలనీల్లో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. సరంగడోలా వీధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.23,740 స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాంబేకాలనీలోని ఓ ఇంటిలో జూదమాడుతున్న ఏడుగురి ని పట్టుకొని వారి నుంచి రూ.8,000 స్వాధీనం చేసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. 12 మందిపై వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేశారు. గతంలో కూడా వన్‌టౌన్‌ పరిధిలో పేకాట శిబిరాలపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పేకాటరాయుళ్లను వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - Feb 22 , 2026 | 11:45 PM