రావణ్‌పై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:39 PM
హిందువుల మనోభా వాలు దెబ్బతినేలా పవిత్ర గ్రంథాలు, సనాతన ధర్మంపై అను చిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రశ్న రావణ్‌పై చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్ రావు తదితరులు గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆమదాలవలస, జూలై 9 (ఆంధ్రజ్యోతి): హిందువుల మనోభా వాలు దెబ్బతినేలా పవిత్ర గ్రంథాలు, సనాతన ధర్మంపై అను చిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రశ్న రావణ్‌పై చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్ రావు తదితరులు గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాజంలో అశాంతిని రేకెత్తించడంతో పాటు దేశ సార్వభౌమాధికారికి విఘాతం కలిగించేలా రావణ్ చర్యలున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్‌తో పాటు అతనికి మద్దతిస్తున్న వైసీపీకి చెందిన మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, కొడాలి నానిలపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశా రు. కార్యక్రమంలో జనసేన నాయకులు పైడి మురళీమోహన్, కాగితాపల్లి రాంబాబు, తేజేశ్వరరావు, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.