యువకుడిపై పోక్సో కేసు నమోదు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:07 AM
నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఆత్మహత్య కేసులో ఓ యువకుడిపై శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఆత్మహత్య కేసులో ఓ యువకుడిపై శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 15న సదరు బాలిక తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎచ్చెర్ల మండలం లావేరు గ్రామానికి చెందిన కశింకోట పవన్‌కుమార్‌కు ఇన్‌స్ర్టాగ్రాం ద్వారా బాలిక పరిచయమైనట్టు గుర్తించారు. ప్రేమపేరుతో బాలికను మోసం చేయడంతో పాటు వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో మనస్తాపానికి గురైంది. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు టూటౌన్ ఎస్‌ఐ హేమంత్ కల్యాణ్ తెలిపారు.