తాగునీరందించి ఆదుకోండి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:00 AM
తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం తగు చర్య లు తీసుకుని ఆదుకోవాలని ఆబోతులపేట గ్రామ మహిళలు కోరారు.
ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌కు మహిళల వినతి
జి.సిగడాం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణం తగు చర్య లు తీసుకుని ఆదుకోవాలని ఆబోతులపేట గ్రామ మహిళలు కోరారు. ఈ మేరకు సోమ వారం పింఛన్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావును గ్రామస్థులు సమస్యలు విన్నవించారు. తాగు నీటి ఎద్దడితో అవస్థలు పడుతున్నామని, కాలువల్లో పూడికలో తీయడం లేదని, దీంతో దుర్గంధం వెద జల్లుతోందని, రోడ్లు పాడయ్యాయని, వీధిలైట్లు లేక చీకటిలో రాకపో కలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే ఎన్‌ఈ ఆర్ తాగునీటి సరఫరా చేపట్టాలని సంబంధిత అధి కారులకు ఫోన్‌లో సూచించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు ఉన్నా ఎందుకు పనులు ప్రారం భించలేదని పీఆర్ ఏఈని ప్రశ్నించారు. తక్షణం తగు చర్యలు చేపట్టాలన్నారు. కాలువ ల్లోని పూడికతీత చేపట్టి పారిశుధ్య పనులు చేప ట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కుమరాపు రవికుమార్, వజ్జపర్తి రఘురాం, టంకాల మౌళీశ్వరరావు, బూరాడ వెంకటరమణ, నక్క మురళి, బెవర జగన్నాఽథరావు, పొగిరి నారాయణరావు, బి.అప్పల నాయుడు, కూనుబిల్లి కూర్మారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.