ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించండి
ABN , Publish Date - Feb 02 , 2026 | 10:59 PM
తమకు ఆర్‌ఆర్ ప్యాకేజీని ఇప్పించాలని కొవ్వాడ అణు విద్యుత్ నిర్వాసితులు డిమాండ్ చేశారు.
- ‘కొవ్వాడ’ నిర్వాసితుల డిమాండ్
- పీజీఆర్‌ఎస్‌లో వినతి
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తమకు ఆర్‌ఆర్ ప్యాకేజీని ఇప్పించాలని కొవ్వాడ అణు విద్యుత్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అధికారులకు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2017లో మా భూములను తీసుకున్నారు. ఇప్పటికి 85 శాతం మాత్రమే పరిహారం అందజేశారు. మిగిలిన 15శా తం కూడా వెంటనే విడుదల చేయాలి. 18 ఏళ్లు దాటిన 650 మందికి ఆర్‌ఆర్ ప్యాకేజీని వర్తింపచేసి మమ్మల్ని ఆదుకోవాలి.’అని రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితులు కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు
మా భూమిని వేరే వారి పేరిట మార్చేశారు..
‘గత వైసీపీ ప్రభుత్వంలో భూ రీసర్వే పేరుతో మాకు చెందిన 1.50ఎకరాల భూమిని వేరే వ్యక్తుల పేరిట అధికారులు మార్చేశారు. న్యాయం చేయాలని ఇప్పటివరకు ఆరుసార్లు గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమ ర్పించాం. జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా తహసీల్దారు కార్యాలయ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే భూ యజమాని మనోవేదనతో శ్రీకాకు ళం ప్రభుత్వాసుపత్రిలో పడి ఉన్నాడు. ఇప్పటికైనా న్యా యం చేయండి’ అని రణస్థలం మండలం కమ్మసిగ డాం పంచాయతీ, యాగాటిపాలెం గ్రామానికి చెందిన తల్లీ, కుమారుడు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.
అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: డీపీవో
అర్జీలను సకాలంలో పరిష్కరించాలని డీపీవో భారతీ సౌజన్య అధికారులకు సూచించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎస్‌ఓ సూర్యప్రకాష్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారులు సంతృప్తి చెందేలా, నిర్ణీత కాల వ్యవఽ దిలో ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. ఈ కార్య క్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి
జి.సిగడాం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రైల్వే మూడో లైన్ విస్తరణ పనుల కోసం భూములు, పంట పొలాలు, కళ్లాలు, ఇళ్లు కోల్పోతున్న తమకు అధికారులు న్యాయం చేయాలని బాతువ గ్రామస్థు లు కోరారు. ఈ మేరకు జడ్పీలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే నుంచి చెల్లించే నష్ట పరిహారం, ఇతర అంశాలపై ఇంతవరకు స్పష్టత లేదని, ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పెద్ద చెరువు నీటి సంఘం అ ధ్యక్షుడు ముళ్లు హరినాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల వెంకటర మణ, గ్రామస్థులు డోల వెంక టరమణ, కూనుబిల్లి శ్రీనివాస రావు, మీసాల కృష్ణారావు, తనుబుద్ది సింహచలం, జమ్ము ఉత్తరనాయుడు, రెడ్డి సంతోష్, మీసాల శ్రీనివాసరావు, బూటు ముకుంద, సురేష్, అసిరినా యుడు, తదితరులు ఉన్నారు.