ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:17 PM
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ.అనురాధ సూచించారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారులు
నరసన్నపేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ.అనురాధ సూచించారు. సోమవారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, స్ర్కూట్నీ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్ ప్రసాద్, సీఐ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో జగన్మోహన్‌రావు, ఎస్‌ఐ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నందిగాం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక ఎన్నిక లకు నోటిఫికేషన్ విడుదలైందని, బుధవారం నుంచి మూ డురోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అలివేలు మంగమ్మ, సహాయ రిటర్నిం గ్ అధికారులు పెద్దింటి సోమేశ్వరరావు, యు.కుమార్‌ప ట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మండలపరి షత్ కార్యాలయంలో ఈ నెల 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.
అభ్యర్థులకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి
పోలాకి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుకోసం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలని రిటర్నింగ్ అధికారి వెంకటమధు తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. ఎంపీడీవో సూర్యప్రకాష్, తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్ పాల్గొన్నారు.
- ఎల్.ఎన్.పేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరిం చాలని మండల ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపా రు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీ య పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. రోటరీనగర్ పోలింగ్ కేంద్రాన్ని సీఐ సన్యాసినాయుడు పరిశీలించారు.
- హిరమండలం, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యే విధంగా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని మండల రిటర్నింగ్ అధికారి రాజగోపాలం కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
-పాతపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ గురకులంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ల ఏర్పాట్లను సివిల్ సప్లైస్ జిల్లా కార్యనిర్వాహణాధికారి తామాడ వేణు సోమవారం పరిశీలించారు.