పెచ్చులు రాలిపోయి.. గోడలు బీటలు వారి
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:00 AM
: మండలంలోని హరిపురం లోని పశువైద్యశాల భవనం శిథి లావస్థకు చేరుకుంది. 65 గ్రామా లకు చెందిన రైతులకు పశువులకు వైద్యసేవలందిస్తున్న ఆసుపత్రిని 45 ఏళ్ల కిందట నిర్మించారు. ఈ భవనానికి నిర్వహణ, మరమతులు లేకపోవడంతో శ్లాబుపై భాగం నుంచి పెచ్చులు రాలిపోతున్నాయి.
మందస, అక్టోబరు 4 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని హరిపురం లోని పశువైద్యశాల భవనం శిథి లావస్థకు చేరుకుంది. 65 గ్రామా లకు చెందిన రైతులకు పశువులకు వైద్యసేవలందిస్తున్న ఆసుపత్రిని 45 ఏళ్ల కిందట నిర్మించారు. ఈ భవనానికి నిర్వహణ, మరమతులు లేకపోవడంతో శ్లాబుపై భాగం నుంచి పెచ్చులు రాలిపోతున్నాయి. గోడలు సైతం బీటలు వారుతున్నా యి. దీంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తోం దనని వైద్యులు ఆందోళనచెందుతున్నారు. ప్రధానంగా పెచ్చులు రాలిపోయి గోడలు బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతుందోనని సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. వైద్యంకోసం పశువులు తీసుకొచ్చే రైతు లు కనీసం లోపల కూర్చొనేందుకు భయపడుతున్నారని వాపోయారు. ఈ భవనం దుస్థితిని పదేళ్లుగా ప్రజా ప్రతినిధులకు విన్పవించుకున్నా కనీసం స్పందన లేకుం డాపోయిందని పలువురు రైతులు వాపోతున్నారు. అధికా రులు, ప్రజాప్రతినిదులు స్పందించి మరమ్మతులు చేపట్టా లని, కొత్త భవనం మంజూరు చేసే చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.