మానవ మనుగడకు మొక్కలు దోహదం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:18 AM
మానవ మనుగడకు మొక్కలు దోహదపడతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిర క్షించాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మానవ మనుగడకు మొక్కలు దోహదపడతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిర క్షించాలని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ నగర్‌లోని అమరావతి పార్క్‌లో మొక్కలు నాటారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభిం చారు. చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. అలాగే నియోజక వర్గంలో నూతనంగా మంజూరైన స్పౌజ్ కోటా లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య కరంగా ఉండవచ్చన్నారు. ఇంటిలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇంటింటికీ వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. పట్టణాలు, గ్రామాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభి వృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కార్య క్రమంలో మునిసిపల్ కమిషనర్ టి.రవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, నాయకులు నూకరాజు, మురళీ ధర్, శంకర భాస్కరరావు పాల్గొన్నారు.