Share News

అభివృద్ధి పనులకు ప్రణాళికలు: శిరీష

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:51 PM

పలాస, మందస, వజ్రపుకొత్తూరు మం డలాలు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్ట డానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

  అభివృద్ధి పనులకు ప్రణాళికలు: శిరీష
సీసీరోడ్డు ప్రారంభిస్తున్న శిరీష

కాశీబుగ్గ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పలాస, మందస, వజ్రపుకొత్తూరు మం డలాలు, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్ట డానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిఽధిలోగల ఐదోవార్డులో మూడు రోడ్లుకు శంకుస్థాపన, 13వ వార్డులో రోడ్డుకు శంకుస్థాపనచేయడంతోపాటు 17వవార్డులో నాలుగు సీసీరోడ్లు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జినిర్మించి తక్కువ రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలి పారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాసరావు,ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబురావు, మునిసిపల్‌ చైర్మన్‌ గిరిబాబు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, గాలి కృష్ణారావు, నరేంద్ర,చంద్రశేఖర్‌త్యాడి, రామకృష్ణ, కొత్తం సత్యం పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:51 PM