మందస రాజవంశీయుడు పీకే సింగ్‌దేవ్ కన్నుమూత
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:40 PM
మంజూ షా (మందస) రాజవంశీయుడు, టెరిటోరియల్ ఆర్మీ కమాండర్ రాజా పటాయత్ ప్రతాప్ కేసరి సింగ్‌దేవ్ (78) కన్నుమూశారు.
హరిపురం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మంజూ షా (మందస) రాజవంశీయుడు, టెరిటోరియల్ ఆర్మీ కమాండర్ రాజా పటాయత్ ప్రతాప్ కేసరి సింగ్‌దేవ్ (78) కన్నుమూశారు. ఆయన గుండె పోటుతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో మంజుషా సంస్థానంతోపాటు ఒడిశాలో విషాదఛాయలు అలముకున్నాయి.
మందస సంస్థానానికి చివరి రాజు అయిన రాజా జగన్నాథ రాజమణి రాజ్‌దేవ్ రెండో కుమారుడు ప్రతాప్ కేసరి సింగ్‌దేవ్. ప్రస్తుత మం జుషా కల్నర్ రాజా చత్రపతి సింగ్‌దేవ్‌కి స్వయాన తమ్ముడు. టెరిటోరియల్ ఆర్మీలో కమాండర్‌గా బాధ్యతలు చేపడుతూ రిటైరు అయ్యారు. ఈయన హయాంలోనే మందస ప్రాంతంలో వేలాది మంది యువకులు టెరిటోరియల్ ఆర్మీలో చేరి దేశానికి సేవలందించారు. ఆర్మీ నుంచి రిటైరు అయ్యాక భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా పీకే సింగ్‌దేవ్‌కు ఒక కుమార్తెతోపాటు ఇద్దరు మను మలు శివాంజలి, శ్రీవర్థన్ ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం మందస సంస్థానం వ్యవహారాలు చూసుకుంటున్నారు.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
పటాయత్ సాహెబ్‌గా అందరితో ఆత్మీయంగా మెలిగిన పీకే సింగ్‌దేవ్ మరణ వార్తవినగానే భువనేశ్వర్‌లోని ఖార్వేనగర్‌లోని ఆయన నివా సానికి అభిమానులు, బంధుమిత్రులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఆయన సేవలం దించిన 120 ఐఎన్‌ఎఫ్ బెటాలియన్ టెరిటోరియల్ సైనికులు అంత్యక్రియల్లో పాల్గొని సైనిక లాంఛనాలతో పూరీ పుణ్యక్షేత్రంలోని స్వర్గధ్వార్ వద్ద శాస్త్రోక్తంగా గురువారం అంతిమ సంస్కా రాలు నిర్వహించారు.