Share News

గంజాయి రవాణాదారుడిపై పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగం

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:08 AM

గంజాయి రవాణా, కొనుగోలు, విక్రయాలకు పదేపదే పాల్పడుతున్న జలగడుగుల తారా వికాస్‌ (24)పై పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

గంజాయి రవాణాదారుడిపై   పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగం

శ్రీకాకుళం క్రైం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా, కొనుగోలు, విక్రయాలకు పదేపదే పాల్పడుతున్న జలగడుగుల తారా వికాస్‌ (24)పై పీఐటీఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు నిందితుడికి ఏడాది పాటు విశాఖ సెంట్రల్‌ జైల్లో నిర్బంధించనున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే రెండు గంజాయి కేసులు నమోదుయ్యాయని, పలుమార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకేష్‌ కుమార్‌మీనా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

1111111111111

Updated Date - Nov 18 , 2026 | 01:08 AM