Share News

గంజాయి స్మగ్లర్‌పై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:55 PM

శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన ఓ ఉద్యోగిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కుంది.

గంజాయి స్మగ్లర్‌పై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌

శ్రీకాకుళం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడిన ఓ ఉద్యోగిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కుంది. సమాజానికి ముప్పుగా పరిణమిం చిన అతడిపై ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌ (పీఐటీ ఎన్‌డీపీఎస్‌) చట్టం-1988’ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్‌) శాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ ముఖేష్‌ కుమార్‌ మీనా బుధవారం జీవో ఆర్టీ 1704ను జారీ చేశారు. నగర పరిధి పెద్దరెల్లి వీధికి చెందిన జలగడుగుల తారా వికాస్‌ అలి యాస్‌ వికాస్‌ (24) తండ్రి మరణంతో కారుణ్య నియామకం కింద ఆసుపత్రిలో జూనియర్‌ అసి స్టెంట్‌గా చేరాడు. అయితే విలాసవంతమైన జీవి తానికి అలవాటుపడి గుట్టు చప్పుడు కాకుండా అనుచరులతో గంజాయి దందా మొదలుపెట్టి పర్లాకిమిడి నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలో పలు ప్రాంతాలకు రవాణా చేశాడు. ఇత డిపై శ్రీకాకుళం వన్‌టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల లో రెండు ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చట్టంపై ఏమాత్రం భయం లేని ఇతడిని అధికారులు ‘డ్రగ్‌ అఫెండర్‌’గా నిర్ధారిం చారు. ఇతడి కార్యకలాపాల వల్ల సమాజానికి ప్రమాదం పొంచి ఉండడంతో ఎస్పీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ మేరకు వికాస్‌ ను వెంటనే అరెస్ట్‌ చేసి విశాఖ సెంట్రల్‌ జైలులో నిర్బంధించాలని ఆదేశాలు జారీ చేసింది. తదు పరి ఉత్తర్వులు వచ్చే వరకు అతడు జైలులోనే ఉంటాడని, అడ్వైజరీ బోర్డు ముందు తన వాదన వినిపించుకునే అవకాశం అతడికి ఉందని ప్రభు త్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Sep 30 , 2026 | 11:55 PM