Share News

గంజాయి స్మగ్లర్‌పై ‘పిట్‌ ఎన్డీపీఎస్‌’ అస్త్రం

ABN , Publish Date - May 22 , 2026 | 11:49 PM

ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఓ కరుడుగట్టిన స్మగ్లర్‌ ఆటను పోలీసులు కట్టిం చారు. పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి తీసు కొచ్చి జిల్లాలో విక్రయిస్తున్న మోస్ట్‌వాంటెడ్‌ డ్రగ్‌ అఫెండర్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మో పింది.

గంజాయి స్మగ్లర్‌పై ‘పిట్‌ ఎన్డీపీఎస్‌’ అస్త్రం

విశాఖ సెంట్రల్‌ జైలుకు నిందితుడు..

శ్రీకాకుళం, మే 22 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం కేంద్రంగా గంజాయి దందా సాగిస్తున్న ఓ కరుడుగట్టిన స్మగ్లర్‌ ఆటను పోలీసులు కట్టిం చారు. పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి తీసు కొచ్చి జిల్లాలో విక్రయిస్తున్న మోస్ట్‌వాంటెడ్‌ డ్రగ్‌ అఫెండర్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మో పింది. పదే పదే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడు తున్న ఇచ్ఛాపురం పట్టణం పురు షోత్తపురం చిన్నవీధికి చెందిన రొయ్యి త్రినాథం (23)ను ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌- 1988 చట్టం (పిట్‌ ఎన్డీపీఎస్‌) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్‌) శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం జీవోఆర్టీ నెంబర్‌ 833 విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రొయ్యి త్రినాఽథం అంతర్రాష్ట గంజాయి స్మగ్లింగ్‌ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ప్రధా నంగా ఒడిశాలోని చంద్రగిరి ప్రాంతానికి చెంది న మాన్యువల్‌ బీరా తదితరుల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు ఇచ్ఛాపురం తీసుకు వచ్చి జాతీయ రహదారిపై లారీ డ్రైవ ర్లకు, యువ తకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసు కుంటున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా గంజాయి కొనుగోలు, నిల్వ, విక్రయాలు చేప ట్టడం నిత్యకృత్యంగా మారింది.

గతంలో నమోదైన కేసులివే..

త్రినాథంపై ఇప్పటికే ఇచ్ఛాపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు ఎన్డీపీఎస్‌ కేసులు నమో దయ్యాయి. 2022 నవంబరులో సుమారు 33 కిలోల గంజాయితో పట్టుబడి ఏ-2గా ఉన్నాడు. ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి గంజాయి కొని తమిళనాడు వ్యాపారికి అమ్ము తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకు న్నారు. 2023 జూలైలో పురుషోత్తపురం ఏపీ మోడల్‌ స్కూల్‌ సమీపంలో 31.960 కిలోల గంజాయితో పట్టుబడిన కేసులో ఏ-5గా ఉన్నాడు. ఈ రెండు కేసుల్లోనూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివే దికలు త్రినాఽథం వద్ద దొరికింది గంజాయేనని నిర్ధారిం చాయి. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లోనూ చార్జి షీట్లు దాఖలు కాగా కోర్టులో విచారణ దశలో ఉన్నా యి. ఇదిలా ఉండగా సదరు నిందితుడిపై తరచూ కేసులు నమోదై అరెస్ట్‌ అవుతున్నా బెయిల్‌పై బయటకు వస్తున్నాడు. అయినా అతని తీరు మారకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా వ్యవహ రిస్తుండ డంతో అతని కార్యకలాపాలపై ఎస్పీ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇతడు సరఫరా చేస్తున్న గంజా యి వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోం దని, సమాజానికి ముప్పుగా మారాడని పోలీసుల నివేదిక మేరకు అతడిని పక్కా ‘డ్రగ్‌ అఫెం డర్‌’గా పరిగణిస్తూ ఎస్పీ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. సాధారణ చట్టాలతో ఇతని నేరాలను తక్షణమే నిలువరించడం కష్టమని భావించిన ప్రభుత్వం పీడీ యాక్ట్‌కు సమాన మైన ‘పిట్‌ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌-1988’లోని సెక్షన్‌ 3(1)ని ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇతడిని విశాఖపట్నంలోని కేంద్ర కారాగారంలో నిర్బంధించాలని జైళ్ల శాఖ సూపరింటెండెంట్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Updated Date - May 22 , 2026 | 11:49 PM