Share News

మురుగు నీటి చెంతన పైపులైన్లు

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:02 AM

టెక్కలి పంచాయతీ పరిధిలోని మంచినీటి కుళాయిల నిర్వహణ గాడితప్పుతోంది. మురుగు కాలువల చెంతనే పలు వీఽఽధుల్లో కుళాయిల పైపులైన్లు ఏర్పాటు చేశారు. అక్కపువీధి, తెలుకలవీధి, తెలుగుబ్రాహ్మణవీధి, కోదండరామవీధి తదితర ప్రాంతాల్లోని కాలువల్లో మురుగు నీరు లీకైన చోట పైపులైన్లలోకి చేరుతోందని పలువురు వాపోతున్నారు.

మురుగు నీటి చెంతన పైపులైన్లు
అక్కపువీధిలో మురుగు నీటిలో కుళాయి నీటిని పడుతున్న స్థానికులు

టెక్కలి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): టెక్కలి పంచాయతీ పరిధిలోని మంచినీటి కుళాయిల నిర్వహణ గాడితప్పుతోంది. మురుగు కాలువల చెంతనే పలు వీఽఽధుల్లో కుళాయిల పైపులైన్లు ఏర్పాటు చేశారు. అక్కపువీధి, తెలుకలవీధి, తెలుగుబ్రాహ్మణవీధి, కోదండరామవీధి తదితర ప్రాంతాల్లోని కాలువల్లో మురుగు నీరు లీకైన చోట పైపులైన్లలోకి చేరుతోందని పలువురు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల్లో నీరు ఎక్కువగా చేరడంతోపాటు పైపులైన్లు రోజుల తరబడి మురుగు నీటిలోనే ఉండడంతో ఆ నీటినే తాగాల్సివస్తోందని, దీంతో వ్యాధులు ప్రబలు తాయోమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్కలి పంచాయతీ ప్రత్యేకాధికారిగా స్థానిక ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి నియమితులై నెలలు గడుస్తున్నా కొళాయిల నిర్వహణపై పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి కాలువల్లోనే పైపులైన్లు ఉన్నాయని పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మార్చడానికి చర్యలు తీసుకోవడంలేదని పలువురు మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి మురుగునీటి కాలువల చెంతన ఉన్న కొళాయి పైపులైన్లు మార్చి సురక్షితమైన తాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:02 AM