‘ఫొటో ఓటరు జాబితాలు సిద్ధం’
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:34 PM
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునిసిపాలిటీ పరిధి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేశామని కమిషనర్ తమ్మినేని రవి తెలిపారు.
ఆమదాలవలస, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునిసిపాలిటీ పరిధి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేశామని కమిషనర్ తమ్మినేని రవి తెలిపారు. ముద్రణ పూర్తి చేసిన ఓటర్ల జాబితాలను శనివారం మునిసిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక జీవో విడుదల చేస్తూ ఎన్నికలు జరగని మునిసిపాలిటీ పరిధిలో అక్టోబరు 24 నాటికి ఫొటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించిందన్నారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన ఐదు వార్డులతో పాటు 28 వార్డులకు చెందిన ఓటర్ల జాబితాలను రూపొందించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.