కార్మికుల ముంగిటకే పీఎఫ్, ఈఎస్‌ఐ సేవలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:19 AM
కార్మికులు, ఉద్యోగుల సమ స్యలను సత్వరమే పరిష్కరించి వారికి ప్రభుత్వ సేవలను మరింత చేరు వ చేయడమే లక్ష్యమని ఈ ఎస్‌ఐ అసిస్టెంట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ సాహు, ఈపీఎఫ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ధర్మారావు, ఈఎస్‌ఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీప్రజ్ఞ అన్నారు.
‘సువిధ సమాగం’, ‘నిధి ఆప్ కే నికట్’ పేరిట అవగాహన
శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కార్మికులు, ఉద్యోగుల సమ స్యలను సత్వరమే పరిష్కరించి వారికి ప్రభుత్వ సేవలను మరింత చేరు వ చేయడమే లక్ష్యమని ఈ ఎస్‌ఐ అసిస్టెంట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ సాహు, ఈపీఎఫ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ధర్మారావు, ఈఎస్‌ఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీప్రజ్ఞ అన్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. సోమవారం శ్రీకాకుళం ఈఎస్‌ఐ కార్యాలయం, రాగోలు లోని జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కార్యక్ర మాలను చేపట్టారు. ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో ‘సువిధ సమాగం’, ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలో ‘నిధి ఆప్ కే నికట్’ (మీ వద్దకే నిధి) పేరిట అవగాహన, సమస్యల పరిష్కార శిబిరాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా అధికారులు నేరుగా ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల ద్వారా అందే సామాజిక భద్రతా ప్రయోజనా లను కార్మికులు, ఉద్యోగులందరూ సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్మికుల నుంచి వినతులను స్వీకరించారు. అవగాహన లేక దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను అధికారుల బృందం పరిశీ లించి వాటిలో చాలా వరకు అక్కడికక్కడే పరిష్క రించి లబ్ధిదారులకు ఊరట నిచ్చారు. అధికారులు తమ వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పలువురు ఈఎస్‌ఐ, పీఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.