‘పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం’
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:25 AM
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం పెంపొందు తుందని ఎంఈవో కేఏ రాములు అన్నారు.
ఆమదాలవలస, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం పెంపొందు తుందని ఎంఈవో కేఏ రాములు అన్నారు. గురు వారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠ శాల గ్రంథాలయ అభివృద్ధికి రోటరీ క్లబ్ ప్రతినిధు లు పుస్తకాలను అందజేశారు. నీతికథలు, రామా యణ, మహాభారతం ఇతిహాసాలకు సంబందిం చిన సుమారు 50 పుస్తకాలను వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వీటీ చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ కన్వీనర్ బుడుమూరు సూర్యా రావు, జనచైతన్య వేదిక కన్వీనర్ గొంటి గిరిధర్, నాట్య మండలి ప్రతినిధి చింతాడ రామ చంద్ర రావు పాల్గొన్నారు.
‘పుస్తకానికి మించిన నేస్తం లేదు’
కంచిలి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పుస్తకానికి మించిన నేస్తం లేదని బూరగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ముప్పన సోమేశ్వరరావు అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం నమస్తుభ్యం అనే తెలుగు అక్షరమాలలో పుస్తకాలను అమర్చారు. ఒక మంచి పుస్తకం చదివితే కొత్త స్నేహితుడిని పొందినట్లవుతుందన్నారు.
కవిటి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): విద్యతో సామాజిక వికాసం సాధ్యమని శ్రీశయన చైతన్య దీపిక ప్రతినిఽధులు అన్నారు. రాజపురంలో గురువారం సంఘ భవ నంలో విద్యాసదస్సు నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు డి.మోహనరావు, డి.వీర్రాజు, బి.ఆనంద్, బి.జానకిరావు, తదితరులు పాల్గొన్నారు.