Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:41 AM

వత్సవలసలో రాజమ్మను శనివారం దర్శించుకొని తిరిగి స్వగ్రామా నికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటోబోల్తా పడిన ఘట నలో మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గార, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): వత్సవలసలో రాజమ్మను శనివారం దర్శించుకొని తిరిగి స్వగ్రామా నికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటోబోల్తా పడిన ఘట నలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వెంకటరమణ కూర్చున్న ఆటో శనివారం కొర్లాం రోడ్డు మలుపు వద్ద బోల్తాపడింది. ఈ సమ యంలో వెంకటరమణ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని శ్రీకాకుళంలోని ప్రైవే ట్‌ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గార ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు తెలిపారు. మృతుడి కుమారుడు రాకేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు

జి.సిగడాం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): బాతువ రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఆదివారం గుర్తించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జీన్‌ ఫ్యాంట్‌, టీషర్టు ధరించి ఉన్నాడ న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమదాలవలస రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 12:41 AM